సన్న రకం దొడ్డు రకం అని తేడా లేకుండా వరి ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలి

జైపూర్ మండల్ బిజెపి పార్టీ అధ్యక్షుడు దూట రాజ్ కుమార్

జైపూర్, నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున జైపూర్ మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షులు దూట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ సంస్థల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునందన్ ఆదేశాల మేరకు రైతుల దగ్గర నుండి ప్రతి వరి గింజలు కొనుగోలు చేయాలని ప్రతి వరి పంటకు 500 రూపాయల బోనస్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిందని, ఒకవైపు వర్షాకాలం ప్రారంభమవుతుంన్న వరి కేంద్రాలలో కుప్పలు కుప్పలుగా ధాన్యం ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతుల దగ్గర నుండి వడ్లను కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని అన్నారు. తదనంతరం పలు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని జైపూర్ తహసిల్దార్ కి అందజేశారు. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి గౌడ్ మండల సీనియర్ నాయకులు రాజేశ్వరరావు షేగ్గం సంతోష్ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version