గ్రామాలలో గుడుంబా అమ్మకాలు
హెచ్చరించిన మారని అక్రమ వ్యాపారులు
పరకాల,నేటిధాత్రి
మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా అక్రమ వ్యాపారులు యదేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారు.గుడుంబా అమ్మకదారులు ఇళ్ల గదుల్లో,చెరువు బండ్ల వద్ద, గ్రామాల అవతల ఉన్న చెట్ల నీడల్లో దాచిపెట్టిన సీసాల ద్వారా నాటుసారా సరఫరా చేస్తూ బాగా డబ్బు పోగు చేసుకుంటున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇది మానవ జీవితాలను మరీ కోల్పోడానికి ప్రధాన కారణమవుతోంది. అంతేకాకుండా,గుడుంబా వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.ఈ వ్యాపారులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గుడుంబా విక్రయాలు కొనసాగిస్తున్నారని పలు గ్రామాల ప్రజల సమాచారం.అధికారులు వచ్చి హెచ్చరికలు జారీ చేసి కేసులు నమోదు చేసినప్పటికి అవేం పట్టవన్నట్టుగా అమ్మకదారులు మరింత రెచ్చిపోతున్నారు.గుడుంబా వ్యాపారుల వలలో పడినవారి కుటుంబాలు ఆర్థికంగా,సామాజికంగా దెబ్బతింటున్నప్పటికీ అమ్మకదారులు మాత్రం రోజుకు వేల రూపాయలు లాభాలు గడిస్తున్నారు.పూర్తి నిర్ములన కొరకై గుడుంబా అమ్మకదారులను అదుపులోకి తీసుకొని,వారి మీద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు ఎక్సైజ్,పోలీసు అధికారులను కోరుతున్నారు.
