హైదరాబాద్ బుక్ ఫెయిర్: పుస్తక ప్రియులకు అద్భుత వేదిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కవి, రచయిత డా. పెద్దగొల్ల నారాయణ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను పుస్తక ప్రియులకు అద్భుతమైన వేదికగా అభివర్ణించారు. ఈ ఉత్సవంలో 368కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ భాషల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. పుస్తకాలు మానసిక ఉల్లాసానికి, ఉన్నత విలువలకు దోహదం చేస్తాయని, ప్రతి ఇంట్లో కనీసం 100 పుస్తకాలతో మినీ గ్రంథాలయం ఉండాలని ఆయన సూచించారు. యువతకు పుస్తకాల ప్రాముఖ్యతను తెలియజేయడం అత్యవసరమని, తాను రచించిన ‘విలాపం’ పుస్తకం నెట్ కారణంగా యువత చేతికి చేరడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువకులతో కలిసి బుక్ ఫెయిర్ను సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేశారు.
