పరకాల నేటిధాత్రి(టౌన్)
పోలీసు ఉద్యోగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందిన యువతకురిటైర్డ్ రెవిన్యూ ఉద్యోగి మహమ్మద్ జిలాని ఇద్దరు కుమారులు కుమార్తె ముగ్గురుకి సివిల్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగాలు సాధించిన మహమ్మద్ అప్రోజ్ మహమ్మద్ హైమద్ మహమ్మద్ ఆసియా బేగంలను బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఎల్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులకు రాబోయే రోజుల్లో పేద ప్రజలకు సేవ చేసి మహనీయుల ఆశయాలను సాధించే దిశగా ప్రయాణిస్తున్న భారత పోలీస్ అధికారిగా పని చేసే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ మాదిరిగా పేద ప్రజలకు పేద విద్యార్థులకు విద్యాప్రదాయంలో ముందు ఉండాలని వెనుకబడిన ముస్లిం మైనారిటీ పేద విద్యార్థులకు నిరంతరం తోడు నీడగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పి పరకాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు భాష ఎండి అంజద్ పాషా, బీఎస్పీ మండల అధ్యక్షులు పెండ్యాల మహేందర్,మండల కార్యదర్శి బొచ్చు రవికుమార్, ముస్లిం మైనారిటీ నాయకులు, మోన్ సాబ్,మహమ్మద్ షకీల్, మహమ్మద్ సిరాజ్,మహమ్మద్ మీర్జాబే అలీ,మహమ్మద్ అలీమ్,మహమ్మద్ చౌక అలీఫ్,మహమ్మద్ అనీఫ్ కురేసి,మహమ్మద్ ఫెరోజ్,ఎండి మైనుద్దీన్ జిలాని,మహమ్మద్ రఫీ అఫ్జల్,మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.