చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని చల్లగరిగ, గోపాలపురం, జూకల్, గుంటూరు పల్లి, గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలకు శుక్రవారం రోజున జూకల్ రైతు వేదికలో జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అనంతరంచల్లగరిగ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళ లకు పంపిణిచేసారు.ఈ సందర్బంగా జడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ దసరా కానుకగాను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఆడపడుచుకు చీరను అందించడం జరుగుతుంది అని అన్నారు. అనంతరం విద్యార్థులు క్రీడాల్లో రానించాలని క్రీడా కిట్లను క్రీడాకారులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఏసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి,ఎంపిడిఓ రామయ్య ,చల్లగారిగ సర్పంచ్ లు క ర్రే మంజుల అశోక్ రెడ్డి , పుట్ట పాక మహేందర్, ఎంపీటీసీ జాంబుల తిరుపతి, ఏపిఎం మంజుల, సీసీ రమణ దేవి, వివో ఏలు ఓంకార్, శ్వేత, గీత, కోమల, నలిన, సంధ్య, అనిత నాగరాణి, మహిళలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.