రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామపంచాయతీకి ప్రత్యేక పాలనాదికారిగా ఎంపీడీవో భాస్కర్ రావుని నియమించారు. శుక్రవారం గ్రామపంచాయతీకి ప్రత్యేక పాలనాదికారిగా ఎంపీడీవో భాస్కర్ రావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు. ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, రామడుగు గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శీను, జట్టుపల్లి వీరయ్య, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, నాయకులు మల్లేశం సుమన్, సల్లవుద్దిన్, మల్లేశం, చంద్రయ్య, లచ్చయ్య, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.