– బిఆర్ఎస్వి నాయకులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలోని కిమ్స్ లా కాలేజ్, పౌలోమి బిఈడి కళాశాలల్లో ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాముఖ్యతను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా ప్రచురించినటువంటి ఓటరు అవగాహన కరపత్రాలను విద్యార్థులందరికీ అందిస్తూ, ఓటరు అవగాహన కల్పిస్తూ, ఓటరు ప్రతిజ్ఞ చేపించడం, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది . ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, బిఆర్ఎస్వి కరీంనగర్ నగర అధ్యక్షులు బొంకురీ మోహన్ లు మాట్లాడుతూ విద్యార్ధులే బావి భారతదేశ దిశా నిర్దేశకులు అని రాబోవు రోజుల్లో రాజకీయాల వైపు కూడా యువత రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే ఆయుధంతో మంచి సహృదయ రాజకీయ నాయకులను ఎన్నుకోవాలని మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నాయకులను మనం ఎన్నుకోవాలని తెలియజేశారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రజాసమస్యల మీద ప్రశ్నిస్తూ నిరంతరం ప్రజాసమస్యల సాధనకై పోరాడే నాయకులు మనం కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించుకొవాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షులు విక్రమ్, రాజ్పల్, సంతోష్, నితిన్, కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.