గ్యారెంటీలే అస్త్రాలు..పార్టీల గెలుపు ఆశలు!

`అంతటా గ్యారెంటీలే గ్యారంటీలు!?

`తమిళనాడు ప్రజలకు పార్టీల భంపర్ ఆఫర్లు!

`ఒకరిని మించి మరొకరు ప్రకటనలు.

`మూడు ప్రాంతీయ పార్టీలకు పడుతున్న ముచ్చెమటలు?

`లెక్కల మీద లెక్కలు..

`నమ్మకం ఆపనమ్మకం మధ్య ఉగిస లాటలు!

`విజయ్ ప్రభావం మీదనే రెండు పార్టీలకు భయాలు?

`ఏ పార్టీ ఓట్లు చీల్చుతాడో అని రెండు పార్టీలకు దిగులు.

`ప్రభుత్వ వ్యతిరేక ఓటు పై ఎవరిది పై చేయన్నది అర్ధం కావడం లేదు!

`ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు!

`సర్వే సంస్థలు చెబుతున్న గందరగోళం మాటలు

హైదరాబాద్, నేటిధాత్రి:                     ఒకప్ప్పుడు యాత్రలు, పాదయాత్రలు రాజకీయ పార్టీలను అదికారంలోకి తీసుకొస్తాయన్న గ్యారెంటీ కనిపించింది. ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తోంది. అటు యాత్రలతోపాటు, గ్యారెంటీలు కూడా ఈ మధ్య రాజకీయ పార్టీలకు తోడౌతున్నాయి. గెలుపులో కీలకభూమిక పోషిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలలో గ్యారెంటీల గోల మొదలైంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఈ గ్యారెంటీలు ఒక పార్టీలకు ఊపును తెస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం తమిళనాడులో అదికారంలో వున్న డిఎంకే కొత్తగా హమీల జోలికి వెళ్లడం లేదు. తమ పాలన చూసి ఓట్లేయమని అడుగుతున్నారు. కాని ఏఐడిఎంకే పార్టీ ఇస్తున్న హమీలు, తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా తన పార్టీ గెలుపుకోసం ఆరుగ్యారెంటీలు ప్రకటించారు. ఈ గ్యారెంటీలన్నీ దాదాపు అందరికీ ఒకే గొడుగులా వున్నాయి. తాజాగా ఏఐడిఎంకే ఇచ్చిన గ్యారెంటీలు కొంత విభిన్నంగా వున్నాయి. నిజానికి గ్యారెంటీలన్నీ ఆచరణ సాధ్యమౌతాయా? అంటే ఎవరూ సరైన సమాదానం చెప్పలేరు. ఎదుకంటే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు. అవి ఎంత వరకు అమలుకు నోచుకుంటున్నాయో చూస్తూనే వున్నాం. ఈ గ్యారెంటీలకు భీజం వేసిన కర్నాటకలో కూడా వాటి అమలు అంత ఆశాజనకంగా లేదు. ఈ రెండు రాష్ట్రాలను చూసి గతంలో తెలుగుదేశం కూటమి కూడా ఏపిలో గ్యారెంటీలు ఇచ్చింది. అయితే ఇక్కడ కొన్ని బాగానే అమలు జరుగుతున్నాయి. పొరుగునే వున్న తమిళనాడు కూడ ఆదే బాటలో నడవాలనుకుంటోంది. తాజాగా ఏఐడిఎంకే గ్యారెంటీలు ప్రేజలను ఆకర్షిస్తాయా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే గాని చెప్పలేం. కాకపోతే ఈ గ్యారెంటీలు కొంత జనంలో బాగానే నానుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రేషన్ కార్డు వున్న కుటుంబానికి ఒక ప్రిజ్ ఇస్తామని ఏఐడిఎంకే చెబుతోంది. ప్రతి నెల రేషన్ సరుకులతోపాటు కందిపప్ప్పు, వంటనూనె కూడా ప్రీగా ఇస్తామంటోంది. ఇక ఇప్పటి వరకు చెన్నైకే పరిమితమైన మహిళలకు ఉచిత ప్రయాణం ఏఐడిఎంకే గెలిస్తే ప్రజలందరికీ తమిళనాడు మొత్తం ఉచిత రవాణ అంటున్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10వేల ఆర్ధికసాయం అందిస్తామంటున్నారు. ప్రతి విద్యార్ధికి విద్యా రుణాలు అందిస్తాతమంటున్నారు. వద్దులకు రూ.2వేలు ఫించన్ ఇస్తామంటున్నారు. గ్రామీణ ఉపాధి హమీ పధకం వంద రోజులుకు బదులు 150 రోజులు ఇస్తామంటున్నారు. ప్రతి వర్కింగ్ మహిళకు 25వేల సబ్సిడీతో స్కూటీ ఇస్తామంటున్నారు. జల్లిÅ£ట్లు ఎద్దులకు శిక్షణనిచ్చే కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూ.10లక్షల ఆర్దిక సాయం చేస్తామంటున్నారు. అనేది గ్యారెంటీలు గట్టెక్కిస్తాయా..అధికారం ఇస్తాయా? అనేది ఇప్ప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప్పుడు కేరళలలోనూ గ్యారెంటీల ప్రచారం జోరుగానే సాగుతోంది. తమిళనాడులో విజయ్ ఆరు గ్యారెంటీలు ఇస్తామంటున్నారు. తెలంగాణ తరహా గ్యారెంటీలు విజయ్ భాగానే ప్రచారం సాగిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగానే జనం విజయ్ గ్యారెంటీల వైపు చూస్తున్నారు. విజయ్ ఇస్తున్న హమీలలో డిఎంకే కొన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. విజయ్ మాటలు తమిళనాడు ప్రజలు నమ్మొచ్చనే అంటున్నారు. కేరళ ప్రజలు ఎంత వరకు నమ్ముతారనేదానిపై ఆసక్తి నెలకొని వుంది. ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం గ్యారెంటీలు దక్షిణాదిలో పనికొస్తాయని తెలుస్తోంది. ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలకు పెద్ద యుద్దం. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు అనేక హమీలు ఇస్తున్నారు. వాటికి గ్యారెంటీలంటూ పేరు పెడుతున్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో మాత్రం ఈ గ్యారెంటీల హమీలు బాగానే గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ గ్యారెంటీలు పార్టీలను గట్టెక్కిస్తున్నాయని జనం నమ్ముతున్నారు. అయితే గ్యారెంటీలు అనేవి కాంగ్రెస్ పార్టీ పేటేంట్లుగా కూడా జనం చూస్తున్నట్లున్నారు. అందుకే నమ్మే రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాదిస్తోంది. నమ్మని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోతోంది. కాంగ్రెస్ గ్యారెంటీలను ఉత్తరాదిలో కూడా బిజేపి కాపీ కొడుతుంది. కాని వాటికి గ్యారెంటీలు అని పేరు పెట్టడం లేదు. మరో రూపంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. అందుకే గ్యారెంటీల పర్వం ఎన్నికల సమరంలో ఒక భాగమైపోతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో తమిళనాడు, కేరళ కూడా వున్నాయి. కేరళýలో కాంగ్రెస్ కొంచెం బలంగానే వుంది. అక్కడ ఈసారి అదికారంలోకి రావాలన్న కసితోనే పనిచేస్తున్నట్లుంది. కేరళలలో పెద్దగా బిజేపికి స్కోప్ లేదు. కాంగ్రెస్‌కు ఎంతో కొంత స్దానం వుంది. బలమైన పార్టీగా ఇంత కాలం వున్న వామపక్షాలు, ఈసారి కూడా మళ్లీ అదికారం దక్కించుకోవాలన్న తపనతో వున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ కూడా ఈసారి కేరళలలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందుకు అక్కడ కూడా గ్యారెంటీలను నమ్ముకొని ప్రచారం సాగిస్తోంది. అక్కడ కూడా తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై పెద్దఎత్తున కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది. అక్కడ ఈ మధ్య అన్ని పత్రికల్లోనూ తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీల ప్రకటనలు ఇచ్చినట్లు సమాచారం. అలా గతంలో ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రచారం జరిగింది. దీనికి బీజం కర్నాటకలో పడింది. అయితే అక్కడ పాంచ్ పటాకా పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాదించారు. ఆ తర్వాత ఆరు నెలలకు తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఎన్నికల మ్యానిఫెస్టోలో సుమారు 420 హమీలు ఇచ్చారు. కాని ఆరు గ్యారెంటీల పేరుతో 13 గ్యారెంటీలను ప్రత్యేకంగా ప్రకటించారు. ప్రజలు ఆకర్షించారు. నమ్మించగలిగారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సర్కారు ఏర్పడింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాలకు ఎన్నికల రోల్ మోడల్‌గా పనికొస్తుంది. అయితే దక్షిణాదిలో మరో రాష్ట్రమైన తమిళనాడులో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వున్న ఆరు గ్యారెంటీలను సినీ నటుడు విజయ్ తన విటికే పార్టీ ఎన్నికల గ్యారెంటీలను ఇటీవలే ప్రకటించారు. దాదాపు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పోలి వున్న ఆరు గ్యారెంటీలను విజయ్ ప్రకటించారు. తమిళనాడులో విజయ్ అన్ని రకాల బస్సుల్లో తమిళనాడు మొత్తం ప్రయాణం ఉచితమని చెబుతున్నారు. తమిళనాడులో విజయ్ లక్ష రూపాయలు ప్రస్తావన లేకుండా తులం బంగారం ఇస్తామని చెబుతున్నాడు. పెళ్లికి తులం బంగారం ఇస్తామని అంటున్నారు. దానికి తోడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు 8 గ్రాముల ఉంగరం ఇస్తామని చెబుతున్నారు. తమిళనాడులో విజయ్ మాత్రం ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. పించన్లు రూ.2500 ఇస్తామని మరో గ్యారెంటీ ఇస్తున్నారు. మహిళలకు కూడా ఇస్తామంటున్నారు. తెలంగాణలో చెప్పినట్లు ఆడపిల్లకు స్కూటీలు ఇస్తామన్నారు. విజయ్ కూడా ఆడపిల్లకు స్కూటీలు ఇస్తామంటున్నారు. ఇలా విజయ్ గ్యారెంటీ వలలు వేస్తున్నారు. ఆయన సభలకు కూడా జనం విరగబడి వస్తున్నారు. విజయ్ సభల్లో ఆ విషయం చెబుతున్నప్ప్పుడు చప్పట్లు, ఈలలు కొడుతున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్కోప్ లేదు. బిజేపికి కూడా పెద్దగా ఆదరణ అంటూ ఏమీ లేదు. కేంద్రంలో అదికారంలో వున్న పార్టీగా తమిళనాడు రాజకీయాలను ఏలాలని చూసినా, ఇప్పట్లో సాద్యమయ్యేలా కనిపించడం లేదు. విజయ్ ఆరు గ్యారెంటీలు అధికార డిఎంకేను ఎంత మేర డీకొంటుందన్నది ఎన్నికలు పూర్తియితే గాని తెలియదు. కేరళýలో కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజలు నమ్మే పరిస్దితి కనిపించడం లేదు. ఎందుకంటే కేరళలో వామపక్ష పార్టీలు తెలంగాణ ఆరు గ్యారెంటీల అమలు అబద్దమని ప్రచారం సాగిస్తున్నారు. పైగా అక్కడ సిఎం. పినరన్ విజయ్ కూడా ఖమ్మం వెలుగు మట్ల వివాదాన్ని పెద్దది చేసి ప్రచారం చేస్తున్నారు. ఎలఈడీ స్క్రీన్లు పెట్టి మరీ చూపిస్తున్నారు. ఉత్తరాదిలో పెద్దగా గ్యారెంటీలు పనిచేయలేదు. మరి తమిళనాడులో విజయ్‌ని నమ్ముతారా? లేక విజయ్ గ్యారెంటీలు నమ్ముతారా? ఏఐడిఎంకే వైపు జనం మొగ్గుతారా? అనేది చూడాలి. గతంలో తమిళనాడులో ఏ పార్టీకైనా ఒక్కసారే ప్రజలు అవకాశమిచ్చేవారు. మొదటిసారి గతంలో జయలలిత పార్టీకి రెండుసార్లు అవకాశం కల్పించారు. ఆ తర్వాత డిఎంకేకు కూడా రెండోసారి ప్రజలు పాలించే అవకాశమిచ్చారు. మరి మూడోసారి కూడా డిఎంకేకే అవకాశమిస్తారా? ప్రత్యామ్నాయ పార్టీలను ఎంచుకుంటారా? డిఎంకే పార్టీకే మరోసారి అదికారం కట్టబెడతారా? అనేది చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version