కోహిర్ మండల్ బేడంపేట్ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండల్ బేడంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. పంచాయతీ కార్యదర్శి కృష్ణ గ్రామస్తులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ తెగువను చాటి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ అని పంచాయతీ కార్యదర్శి కృష్ణ, ఐలమ్మ సంఘం నాయకులు కొనియాడారు. ప్రభుత్వం ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా ఆమె జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.