గ్రామీణ భారత్ బంద్ విజయవంతం

కేంద్ర బిజెపిని గద్దె దించాలి

తెలంగాణలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలి.

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
పలిమెల మండలంలో బందుకు సంపూర్ణ మద్దతు.
మహ ముత్తారం నేటి ధాత్రి.
వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి కేంద్రంలో బిజెపిని గద్దె దించితే తప్ప దేశానికి భవిష్యత్తు ఉండదని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేయాలని ఫిబ్రవరి 16 దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బందును నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫారం ఉద్యోగ సంఘాలు అఖిలభారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా అఖిలభారత స్థాయిలో ఇచ్చిన పిలుపులో భాగంగా పలిమల మండల కేంద్రంలో అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు తెలంగాణ ఆదివాసికరణ సంఘం కెవిపిఎస్ ర్యాలీ నిర్వహించి గ్రామీణ భారత్ బంద్ ని జయప్రదం చేయడం జరిగిందని వారన్నారు.
అదేవిధంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా రైతాంగ కార్మిక వర్గ,శ్రామిక ప్రజల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు, అధికారంలోకి వచ్చేముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు స్విస్ బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయ ఇన్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని అదేవిధంగా ధరలను నియంత్రిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క ఆమెని అమలు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులని కార్పొరేట్లకు తాకట్టు పెడుతూ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించిందని వారు మండిపడ్డారు. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలను అమ్ముతుందని అన్నారు, జాతీయ నగదీకరణ పేరుతోటి మౌలిక వసతులను లీజు పేరుతోటి ప్రైవేటుకరిస్తుందని వారన్నారు, బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేటు సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాలని 20023లో పాలకులు కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని ధర ధరలను నియంత్రిస్తానని వాగ్దానం చేసిన బిజెపి ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో 30 నుండి 56% వరకు పించిందని పెట్రోలు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243 శాతానికి పెంచిందని, ఉద్యోగాలు అందుబాటులో లేనందున స్వయం ఉపాధిలో సరైన వేతనం లేని కార్మిక కుటుంబాలు పెరిగాయని వారన్నారు, అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్టులను తెచ్చిందని కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందని, సమ్మె చేసే హక్కుని కాలరాసిందని, పిఎఫ్ ఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుంది అని, తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి ఎత్తిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా సిపిఎస్ ని రద్దు చేసి, పాత పెన్షన్ ఓ పి ఎస్ ను పునరుద్ధరణ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దో గొప్పో ఉపాధి దొరుకుతుందంటే అది ప్రజా పోరాటాలతో పాటు పార్లమెంట్లో వామపక్షాల కృషి వల్ల వచ్చిన ఉపాధి హామీ పథకం వల్లనేనని ఈ పథకాన్ని కూడా ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం ఎత్తివేయాలి చూస్తుందని విమర్శించారు, ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి ప్రతి వ్యక్తికి 200 రోజుల పని 600 రూపాయల రోజువారి వేతనం ఇవ్వాలన్న డిమాండ్ ను కాతర చేయడం లేదని వారన్నారు. అదేవిధంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రజల కోసం 40 సంవత్సరాల నుండి కొనసాగుతున్న స్కీములను బలోపేతం చేయడం లేదని అన్నారు, 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు మేరకు రైతులు పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టు కోవడంలో విప్లమైందని వారన్నారు, కేరళ తరహా 24 రుణ విమోచన చట్టం తీసుకురావాలని అన్ని బ్యాంకింగ్ సంస్థల నుండి ఒకేసారి రుణమాఫీ చేయాలని విద్యుత్ సవరణ చట్టం ద్వారా విద్యుత్ ప్రవేటికరుణ నిలుపుదల చేయాలని డిమాండ్ ను పట్టించుకోవడంలేదని అన్నారు. అనేక సంవత్సరాలుగా సాగులో ఉండి మూడు వ్యవసాయం చేసుకొని జీవనం గడుపుతున్న ఆదివాసి కుటుంబాలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం అక్కుపత్రాలు ఇవ్వాల్సింది పోయి జాతీయ నూతన అటవీ చట్టాలని తీసుకువచ్చి సవరణల పేరుతోటి అటవీహకుల చట్టానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ కులాల మధ్య మతాల మధ్య వైశాల్యాలను పెంచుతుందని అన్నారు, ఇలాంటి కార్మిక క రైతాంగ శ్రామిక ప్రజల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపిని 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తే తప్ప దేశానికి భవిష్యత్తు ఉండదని,బీజేపీని చిత్తు చిత్తు గా ఓడించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సూదుల శంకర్ కెవిపిఎస్ మండల కార్యదర్శి పాగే పోట్టయ్య, ఆదిలక్ష్మి ,నాగలక్ష్మి అంగన్వాడీలు ఆశలు మధ్యాహ్న భోజనం కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version