సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి
చెన్నూర్,నేటిదాత్రి::
చెన్నూరు పట్టణ కేంద్రంలో సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో రావి చెట్టు నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంకె రవి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ విధానానికి వ్యతిరేకంగా 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి కార్మికుల హక్కులు కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులు అభివృద్ధికి కురిచేస్తున్నారని,అలాగే రైతులకు మద్దతు ధరకై, ఎమ్మెస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని,స్కీమ్ వర్కర్లు,సమస్యలు పరిష్కరించాలని,వ్యవసాయ కూలీలు,వివిధ కార్మిక సంఘాలు,వృత్తి కుల సంఘాలు, ఆటో యూనియన్ విద్యార్థి, యువకులు, మహిళలు పలు సంఘాల నాయకులు సమస్యలు పరిష్కరించాలని ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బోడంకి చందు,కామెర రవి, సిఐటియు జిల్లా నాయకులు,బి గోపీనాథ్, శంకర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు,సమ్మన్న సిపిఐ నాయకులు మాసాని రమేష్ సమ్మన్న సిపిఐ నాయకులు, సుంకరి చందు,సుమతి అంగన్వాడి యూనియన్ నాయకురాలు, ఆశా వర్కర్స్,కరిమ మధ్యాహ్నం భోజన సంఘం మండల, అధ్యక్షులు సిఐటియు నాయకులు, కుమార్,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, జక్కుల మారన్న, రాతి పెళ్లి నాగేష్, మనీ, బండారి రాజేశ్వరి,సిడం సమ్మక్క ఆదివాసి గిరిజన సంఘం నాయకురాలు, మహిళా సంఘం నాయకురాలు, నాగజ్యోతి,ఇళ్ల స్థలాల కమిటీ సభ్యులు, కెవిపిఎస్ నాయకులు,కావేరి మధుకర్,అనిల్ డివైఎఫ్ఐ నాయకులు,ఆవాజ్ నాయకురాలు,సహన బేగం, ఉమారాణి ఇళ్ల స్థలాల పొరాట కన్వీనర్ , తుమ్మ రేణుక ముదిరాజ్ సంఘం నాయకురాలు, బోయిర్ రమాదేవి డుబ్బుల కళాకారుల సంఘం నాయకురాలు, టేకం రాజమ్మ బుడగ జంగాల నాయకురాలు, కే చంద్రన్న, డోoగిరి రాజన్న రైతు సంఘం నాయకులు,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు