నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం!! బ్యూటీ షియన్ శిక్షణకు సంబందించి సర్టిఫికేట్ ల పంపిణీ
జగిత్యాల నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు వెల్గటూర్ మండలం వెల్గటూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వం నుండి శిక్షణ పూర్తి చేసుకున్న బ్యూటీషన్ కోర్సుకు సంబందించిన సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో మమల్ని భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేయడం జరిగిందని,మిగిలిన వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వెల్గటూర్ మండలంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని,ఈ ప్రాంత ప్రజలకు సాగు,త్రాగు నీరు అందించే ఎక్కడ రాజీ పడేది లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు,ఈ కార్యక్రమంలో పిసిసి కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి,సర్పంచ్ మురళి,ఎంపీపీ లక్ష్మి,జెడ్పీటీసీ సుధారాణి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్,ఉప సర్పంచ్ సందీప్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రావు,ఉదయ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు