ఉచిత ఎముకల సాంద్రత (బిఎండి) పరీక్ష శిబిరం
ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని హుజురాబాద్ రోడ్ లో గల హిమ పాలి క్లినిక్ లో ఆదివారం రోజున ఎముకల సాంద్రత(బిఎండి)పరీక్ష, యూరిక్ ఆసిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు హిమ పాలి క్లినిక్ నిర్వాహకులు సూర విష్ణు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 అక్టోబర్ ఆదివారం రోజున డాక్టర్.బండ నవీన్ కుమార్ ఆర్తో ఆధ్వర్యంలో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఉచిత ఓపీ మరియు 2500 రూపాయల విలువగల ఎముకల సాంద్రత (బిఎండి) మరియు యూరిక్ యాసిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వివరాలకు 970 4053212 అనే నెంబర్ ను సంప్రదించాలని కోరారు.