కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించిన మాజీ జెడ్పిటిసి
మహాదేవపూర్ అక్టోబర్ 22 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ జయంతి సందర్భంగా విగ్రహానికి బుధవారం రోజున మాజి జెడ్పిటిసి నివాళులర్పించారు. కొమరం భీమ్ 124వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహానికి మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడుతూ కొమరం భీమ్ చేసిన త్యాగాలను మరువలేనివని ఆయన సమాజం కోసం తోడ్పడిన పలు సందర్భాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
