వీధిలైట్ల బహుకరణ,
మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి
మండలంలోని మొట్లపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా సుమారు 32 వేల రూపాయల విలువగల వీధిలైట్లను గ్రామ తాజా మాజీ సర్పంచ్ నరారి పద్మ వెంకటరెడ్డి మరియు ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు రఘుపతి రెడ్డి మరియు పుర ప్రముఖుల అభ్యర్థన మేరకు మొట్లపల్లి గ్రామానికి చెందిన బజ్జూరు వెంకటేశ్వర్లు (వెటర్నరీ డాక్టర్) శనివారం అందించారు, గతంలో గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సుమారు మూడు లక్షల రూపాయల వ్యయంతో అదనపు గదిని నిర్మించాడు. గత రెండు రోజుల క్రితం గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలోని వీధిలైట్ల ను శనివారం బహుమతిగా అందించాడు. మొట్లపల్లి గ్రామంలో జన్మించిన డాక్టర్ బజ్జురి వెంకటేశ్వర్లు హైదరాబాదులో స్థిరపడి గ్రామం మీద ఉన్న మమకారంతో గ్రామా అభివృద్ధి కోసం పాటుపడుతున్న డాక్టర్ బజ్జూరి వెంకటేశ్వర్లు ను పలువురు గ్రామస్తులు అభినందించారు,