మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పైడిగుమ్మల్ నుండి కోహిర్ కు వెళ్లే మార్గం గుంతల మయంగా మారడంతో ఆటో యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం, తన సొంత నిధులతో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. త్వరలోనే మంజూరైన నిధులతో నూతన రోడ్డు పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ మల్లన్న పాటిల్, కాంగ్రెస్ నాయకులు దావీదు, సుమన్, ఆటో యూనియన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
