ప్రభుత్వ కార్యాలయాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయిస్తున్న మంత్రి.
రేపు గుడి, బడిలో కూడా శ్రీ పద విగ్రహాలకు విప్ జారీ అవుతుంది. మహిళా అధ్యక్షురాలు గీతా భాయ్
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
సమాజం దేశం కొరకు అనేకమంది ప్రాణ త్యాగాలు చేసి ఉన్న మహనీయుల విగ్రహాలు పెట్టాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో శ్రీపదరావు విగ్రహం పెట్టించి మా నాన్నే మహనీయుడు అనిపించుకునేలా మంత్రి వ్యవహరిస్తున్నారని తక్షణమే విగ్రహాన్ని తొలగించాలని మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గీతా బాయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున మహదేవ్పూర్ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మహిళా అధ్యక్షురాలు గీతాబాయి మాట్లాడుతూ బుధవారం రోజు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబ మండల పరిషత్ కార్యాలయంలో తండ్రి శ్రీ పద రావ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పై గీత బాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కానీ, శ్రీపదరావు విగ్రహాన్ని ఏ అర్హతతో పెట్టారూ అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు, ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడాలి కానీ విగ్రహ రాజకీయాలు చేయడం ఏమిటని అని ప్రశ్నించారు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కొమురం భీం, లాంటి అనేక మహనీయులు ఉన్నప్పటికీ వారి విగ్రహాలను ఎందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిష్టాపన చేయడం లేదు, నియోజకవర్గానికి శ్రీపదరావు చేసింది ఏమిటి ఎందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో విగ్రహాలు పెట్టాల్సి వస్తుందని, రాబోయే రోజుల్లో మంత్రి గుడి మరియు బడుల్లో కూడా శ్రీపద రావు విగ్రహాలు పెట్టాలని విప్ జారీ చేసే విధంగా కనబడుతుందని, మహనీయులు ఎవరు లేరు మా నాన్నే మహనీయుడని మంత్రి కార్యాలయాల్లో విగ్రహాలను పెట్టిస్తున్నారని ఎద్దేవ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో పుట్ట మధు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో మహనీయుల చరిత్రలు అలాగే మహనీయుల విగ్రహాలను ప్రతిష్టాపించి నియోజకవర్గ ప్రజలకు మహనీయుల చరిత్రను గుర్తుండేలా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుండే నియోజకవర్గంలో శ్రీ పద విగ్రహాలను ఏర్పాటు చేయని చోటు లేదని, నాయకులు శ్రీ పద విగ్రహాన్ని ఏర్పాటు చేసి మంత్రి కండల్లో ఆనందం కొరకు విచ్చలవిడిగా విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయుల చరిత్రను కాలరాస్తున్నారని గీతాబాయి మండిపడ్డారు. తక్షణమే మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపతిరావు విగ్రహాన్ని తీసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మల్హర్ మండల మహిళా అధ్యక్షురాలు పొంతకాని చంద్రకళ ఉన్నారు.