ఎల్లారెడ్డిపేట నేటి ధాత్రి
ఎల్లారెడ్డిపేట మండలం లో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అరెస్ట్ ఈ సందర్భంగా మార వేణి రజిత్ కుమార్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం తగదని ఇంతకు ముందున్న ప్రభుత్వం బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసులను వాడుకొని నిరుద్యోగుల భవిష్యత్తు నాశనం చేసిందని అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పోలీస్ లను వాడుకొని ఉద్యమాన్ని అని అనిచివేయలని చూస్తే కెసిఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేయాలని గ్రూప్ వన్ ఫిలమస్ లో 1100 అభ్యర్థుల ను స్టార్ట్ లిస్ట్ చేయాలని టి జి పి ఎస్ పి ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న నాయకుల్ని అరెస్టు చేయడం సమజసం కాదని వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని వెంటనే యూపీఎస్పీ తరహాలో జాబ్ కేంద్రను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు