నిజాంపేట, నేటి దాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు రమేష్ బాబు ,శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ శ్రీమతి యాడారం ఇంద్ర , మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ వారు పాఠశాలలో ఉండే విద్యార్థులకు అనేక సేవలు అందించి విద్యా బోధన చేశారన్నారు . అదేవిధంగా బదిలీపై వచ్చిన నూతన ఉపాధ్యాయులు ఈశ్వరయ్య , సుకన్య, నరేష్ ,చంద్రకాంత్ , కుమార స్వామి లకు ఆహ్వానం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి, అర్జున్ పాఠశాల పూర్వ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.