మాజీ ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా అన్నదాన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా దర్మారెడ్డి జన్మదినం సందర్భంగా వెల్లంపల్లి గ్రామంలోని స్థానిక శివాలయంలో మాజి గ్రామ సర్పంచ్ గంట విజయ సమ్మీరెడ్డి ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆలయ సమీపంలో కేకు కట్ చేసి దర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో సింగాడి రాంగోపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెలగందుల కృష్ణ,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.