ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలి…

ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నేటి ధాత్రి :

నిరుద్యోగ యువత తాను ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో సంక్షేమ వారంలో భాగంగా షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు,వెనుకబడిన తరగతులు,మైనారిటీ యువతకు ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి, కెరీర్పై అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,ఎ టి సి ప్రిన్సిపాళ్లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగాలలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించి జీవితంలో స్థిరపడాలని తెలిపారు.వృత్తి విద్య కోర్టులలో ఆధునిక సాంకేతికతను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.తాము ఎంచుకున్న కోర్సులను ఏకాగ్రతతో నేర్చుకోవాలని,తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగరంగంలో రాణించాలంటే నైపుణ్యత తప్పనిసరి అని,మనం నేర్చుకునే ప్రతి అంశం మనం చేస్తున్న పనిలో ఉపయోగపడుతుందని తెలిపారు.ఎంచుకున్న సబ్జెక్టులో పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.జర్మన్ దేశంలో ఎలక్ట్రీషియన్,డ్రైవర్,నర్సింగ్ రంగాలకు అవసరం ఉందని ఉందని,నైపుణ్యత గల వారిని ఎంపిక చేసి జర్మన్ భాషను నేర్పించి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.విదేశాలలో వస్తున్న అవకాశాలకు నైపుణ్యత, అనుభవం తప్పనిసరిగా ఉండాలని,కోర్సు అనంతరం అప్రెంటిస్ షిప్ ద్వారా మరింత నైపుణ్యత నేర్చుకోవాలని తెలిపారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించి అవకాశం ఉన్న చోట ఉద్యోగం కల్పించడం జరుగుతుందని,యువత తాము ఎంచుకున్న కోర్సును ఏకాగ్రతతో నేర్చుకుని,నైపుణ్యత సాధించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version