⏩ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
⏩డిగ్రీ, పీ జి కలశాల యాజమాన్యాలతో చర్చలు జరపాలి.
⏩విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూడాలి.
ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్
కాశిబుగ్గ నేటిధాత్రి
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరించడం తగదని
ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్ ఆరోపించారు.గత మూడు ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడం వలన డిగ్రీ మరియు పీజీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ చదువు పూర్తి అయిన సర్టిఫికెట్లు తీసుకోవడంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు.మరో వైపు డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు లెక్చలర్లకు జీతాలు ఇవ్వలేక,అద్దె భవనాల కిరాయిలు కట్టలేక తీవ్ర సంక్షోభంలో కొట్టిమిట్లాడుతున్నారు అని ఆయన అన్నారు. ఈ తీవ్ర సంక్షోభమైన పరిస్థితులలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బందు కు పిలుపునిచ్చిన సందర్భంలో విద్యార్థులు తీవ్ర నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు.అందువల్ల తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి సమస్యను పరిష్కరించే దిశగా చొరవ తీసుకుని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని హకీం నవీద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.