మంత్రి కొండా సురేఖ.
కాశీబుగ్గ నేటిధాత్రి.
వరంగల్ తూర్పు కాశిబుగ్గ ప్రాంతంలో గత 38 సంవత్సరాలుగా దసరా ఉత్సవ సమితి నిర్వహిస్తున్న రావణాసుర వధ దసరా వేడుకలకు శాశ్వత స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని అటవీశాఖ, పర్యావరణ,మరియు దేవాదాయ శాఖ,మంత్రి కొండాసురేఖ తెలియజేశారు. కాశిబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువు( పద్మనగర్) ప్రాంతంలో శనివారం నిర్వహించిన రావణాసుర వధ దసరా వేడుకలకు కొండ సురేఖ ముఖ్యఅతిథిగా, మరియు విశిష్ట అతిధులుగా డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య,నగర మేయర్ గుండు సుధారాణి,మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్,జ్యోతి ప్రజ్వల చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్లపల్లి రాజకుమార్ ఏర్పాటుచేసిన రావణాసుర ప్రతిమ, మిరమిడ్లు గొలుపే బాణాసంచా చూపరులను ఆకట్టుకున్నాయి.
డిప్యూటీ స్పీకర్ డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ
కాశీబుగ్గ దసరా వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు.
శాసనమండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ
ప్రజా ప్రతినిధిగా తనకు కాశిబుగ్గతో చాలా అనుబంధం ఉందన్నారు. ఉత్సవ సమితికి తాను ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు.
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ
ఉత్సవ సమితి వినతి మేరకు ఉత్సవాలు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు.
మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
కాశీబుగ్గ దసరా ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కాశీబుగ్గ ప్రజానీకానికి దసరా శుభాకాంక్షలు తెలియజేసినారు.
దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, కన్వీనర్ బయ్య స్వామి,కాశీబుగ్గ దసరా ఉత్సవాల కొరకు గతంలో అసెంబ్లీలో ప్రస్తావించిన కొండా సురేఖకు ఉత్సవ సమితి ఎప్పుడు రుణపడి ఉంటుందని రాష్ట్ర మంత్రులుగా ఉత్సవ స్థలానికి శాశ్వత స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోరినారు. రావణాసుర వధ తిలకించడానికి కాశీబుగ్గ,ఏనుమాముల, గీసుకొండ, లక్ష్మిపురం, మొగిలిచర్ల తో పాటు చుట్టు 15 డివిజన్ల నుండి సుమారు 50 వేల మంది ప్రజానికం హాజరైనారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్, 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పటి సులోచన సారయ్య,19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, బిజెపి రాష్ట్ర నాయకులు వన్నాల వెంకటరమణ. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్, ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు వేముల నాగరాజు,కార్యదర్శి గోరంటల మనోహర్, చిలువేరు శ్రీనివాస్, కోశాధికారి గుత్తికొండ నవీన్, ఓం ప్రకాష్ కొలారియా, సంయుక్త కార్యదర్శి సిద్ధూ శ్రీనివాస్, సిలువేరు థామస్,రామ యాదగిరి, రాచర్ల శ్రీనివాస్, సిందం చంద్రశేఖర్, గుల్లపల్లి సాంబశివుడు, గుర్రపు సత్యనారాయణ, మార్టిన్ లూథర్, వెలిశాల రమేష్ బాబు, మార్త ఆంజనేయులు, దుబ్బ శ్రీనివాస్, బాకం హరిశంకర్, గణిపాక సుధాకర్, క్యాతం రవీందర్, ములుక సురేష్, చిలువేరు పవన్, దేవర ప్రసాద్,తోట బాలరాజ్, నాగవెల్లి సునీల్, కుసుమ సతీష్, చిలువేరు రాజు, గుజ్జుల రాకేష్ రెడ్డి, బాల మోహన్, క్యాతం రంజిత్, అల్లి అజయ్ బాబు,ముచ్చర్ల ప్రభాకర్,సొల్లేటి రాఘవచారి, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.