రైతు కంది పంట, డ్రిప్ సెట్ దగ్ధం: రూ. 2 లక్షల నష్టం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచర్యగడి గ్రామంలో రైతు తుమ్మల పల్లి గోపాల్కు చెందిన కంది పంట పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో చేతికి వచ్చిన పంటతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు, మోటార్ పైపు కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో రైతుకు సుమారు 2 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అధికారులు నష్టపరిహారం అందించాలని, నిందితులను శిక్షించాలని రైతు, గ్రామస్థులు కోరుతున్నారు.
