మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తప్పుడు ఆరోపణలు.

పార్లమెంటు ఎన్నికల ఓట్ల కోసం తప్పుడు ప్రచారం.

గ్రంధాలయసంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూములు కబ్జా చేశారని మాట్లాడుతున్న వంశీచంద్ రెడ్డి ఎక్కడ కబ్జా చేయడం చేశారో ప్రజలకి చూపించాలని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం నిరాధారమైన ఆరోపణలు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
గౌడ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉండి గౌడ సామజిక వర్గానికి ఏమి చేయలేదని మాట్లాడటం అవాస్తవం. ఆయన శాఖ బాధ్యతలు తీసుకున్న తరువాతే అనేక కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
ఆయన మంత్రి అయినా తరువాతే గీత కార్మికుల కుటుంబలు భరోసాతో జీవనం సాగించాయి. 
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవ తీసుకొని  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద మాట్లాడి అధికారికంగా నిర్వహించేందుకు
ఉత్తర్వులతో పాటు 10 లక్షల నిధులు  విడుదల చేయించారని అన్నారు. దీనికి సంభందించి 2022 లో ప్రభుత్వం ప్రత్యేక మెమో జారీ చేసింది.
సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలాషాపురం కోట పునర్ నిర్మాణం కోసం 1.26 కోట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేయించారు.
ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఏర్పాటు కోసం చొరవ తీసుకొని స్థల పరిశీలన చేసారు.విగ్రహ ఏర్పాటుకు రూ .3 కోట్లు విడుదల చేయించారు. 2023లో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారని.
గీత కార్మికులు చనిపోతే కనీసం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గీత కార్మికులు చనిపోతే రూ. 5 లక్షల సహాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 637 మంది గీత కార్మికులు
చనిపోతే వాళ్ళ కుటుంబాలకి సకాలంలో సహాయం అందించారు.
తెలంగాణ హరిత హారంలో ఈత చెట్ల పెంపకంతో పాటు ఈత వానలు పెంచే వారికీ ప్రభుత్వం తరుపున సహాయం అందించారు.
ప్రత్యేక నీరా పాలసీ తో పాటు  హైదరాబాద్ లో 7.20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేసారు. నీరా తయారీ పై 319 మందికి శిక్షణ ఇచ్చారు.
గౌడ కులస్తులకి సంబందించిన ఆస్తులు గుంజుకున్నారు అనే ఆరోపణల్లో వాస్తవం లేదని. మీరు అధికారంలోనే ఉన్నారు కదా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు ఎక్కడ చేశారో నిరూపించండి అని సవాల్ విసిరారు. రాజకీయ అనుభవం లేని వంశీచంద్ రెడ్డి, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అన్నారు.

మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కట్ట రవికిషన్ రెడ్డి కామెంట్స్ చేస్తూ

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీచంద్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం పని చేసిన ఇలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ
నాయకులు పని గట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
భూ కబ్జాలు చేసినట్టు చెబుతున్న ఆయన,దమ్ము ఉంటె నిరూపించాలి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది.. వాళ్ళ వద్ద
సమాచారం ఉంటది..వంశీచంద్ రెడ్డి వచ్చి చూపించాలి ఎక్కడ కబ్జా చేశారో..??
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అసత్యాలు మాట్లాడి ఓట్లు పొందాలని చూస్తున్నారు.కల్వకుర్తి లో ఓటమి తరువాత అసలు కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకుండా పోయిన వంశీచంద్ రెడ్డి మల్ల పార్లమెంట్
ఎన్నికల్లో గెలుపు కోసం ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తప్పుడు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చారు.
మహబూబ్ నగర్ లో ఒక సెంట్ భూమి కూడా శ్రీనివాస్ గౌడ్ కబ్జా చేయలేదు. కబ్జా చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పింది విని మాట్లాడటం కాదు దమ్ముంటే నిరూపించాలని. స్థానిక ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. ఎన్నికల్లో తగిన రీతిలో సమాధానం చెప్తారు.
బీసీ నాయకుడు రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు.
సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ నరసింహులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, సీనియర్ లీడర్లు నవకాంత్, శ్రీనివాస్ రెడ్డి, పాల సతీష్, సుధాకర్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version