ఫేస్బుక్ మాయలేడి అరెస్ట్

జమ్మికుంట: నేటిధాత్రి
ఫేస్బుక్ ద్వారా యువకుడితో పరిచయం పెంచుకొని మాయ మాటలు చెప్పి అతని నుండి డబ్బులు కాజేయాలని చూసిన యువతిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. జమ్మికుంట సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి జమ్మికుంట పట్టణానికి చెందిన కోడూరి రాజేష్ అనే యువకుడితో ఫేస్బుక్లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త పెరగడంతో ఇరువురి మధ్య ఫోన్ల ద్వారానే సంభాషణ జరిగింది. ఈ తరుణంలో కోడూరు రాజేష్ జమ్మికుంట లోని తన ఇంటికి వచ్చి తనకు డబ్బులు ఇవ్వాలని లేనట్లయితే నీపై కేసు పెడతానని బెదిరింపులకు గురిచేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆ యువతి గురించి పోలీసులు ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. గతంలో ఈ యువతి కరీంనగర్ పట్టణంలో ఉన్న ఓ యువకుడితో ఇదే తరహాలో ప్రవర్తించి దాదాపు రెండు లక్షల రూపాయలు కాజేయడంతో అక్కడ పోలీస్ కేసు నమోదు అయిందని, అదేవిధంగా మానకొండూరు పోలీస్ స్టేషన్ లో తనను గ్యాంగ్ రేప్ చేయబోయారంటూ ముగ్గురు యువకులపై కేసు పెట్టడంతో ప్రస్తుత ఆ కేసు నడుస్తుందని సీఐ పేర్కొన్నారు. మాయమాటలతో యువకులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న సదరు యువతిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ రవి వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఫేస్బుక్ల ద్వారా పరిచయాలను పెంచుకొని డబ్బులు వసూలు చేస్తున్న వారి మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే పోలీసులను ఆశ్రయించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!