జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంతంలో గురువారం నాగుపాము హల్ చల్ చేసింది. మార్కెట్ ద్వితీయ శ్రేణి కార్యదర్శి రాజా కార్యాలయానికి వస్తుండగా పక్కనుంచి నాగుపాము రావడంతో సిబ్బంది హైరానా పడ్డారు. దాదాపు అరగంట పాటు మార్కెట్ ఆవరణంలోనే నాగుపాము తిరగడంతో రైతులు ఆందోళన చెందారు. మార్కెట్ కార్యాలయం వాచ్మెన్ నాగార్జున నాగుపామును పట్టుకుని బయటికి వదిలేశారు. అరగంట పాటు కార్యాలయంలో సిబ్బంది హైరానా పడ్డారు.