జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా నేటి ::ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శనివారం రోజు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ. సంతాపం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా కొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.