ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి

– టి.ఆర్.పి ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ విడుదల
– టి.ఆర్.పి జిల్లా అధ్యక్షులు దండు వినోద్

సిరిసిల్ల ప్రతినిధి (నేటి ధాత్రి):

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. విద్యహక్కు చట్టం 2009ను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ధర్నాకు జిల్లాలోని ప్రజలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతలు తొలగి సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవ్వాలంటే విద్య హక్కును పకడ్బందీగా అమలు చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు చెట్టిపల్లి నరేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, పట్టణ అధ్యక్షురాలు జ్యోత్స్న, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కొడూరి శ్రీహరి, కొనరావుపేట మండల అధ్యక్షులు గుండా శ్రీకాంత్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు మొగిళ్ల బాబు, సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్ గుండవేని దేవరాజు, తంగళ్లపల్లి మండల కన్వీనర్ చంద్రశంకర్, పట్టణానికి చెందిన గాలి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట యువకులు తుమ్మల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version