దుమ్ముగూడెంమండలఅధ్యక్షలు లంకా శ్రీనివాసరావు తెలిపారు
భద్రాచలం నేటి దాత్రి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే నాలుగు పథకాలు అమలు చేసింది అని మిగిలిన రెండు గ్యారెంటీలో కూడా మరి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని స్పష్టం చేశారు రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం మరియు మహాలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు సమక్షంలో హైదరాబాద్ లో ప్రారంభించారు ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్హులైన గృహం విద్యుత్ వియోగదారులకి మార్చి నెల నుండి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ బిల్లు పథకం అమలు చేయబడుతుందని తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకోగా మిగిలిపోయిన అభ్యర్థుల సైతం ఎవరైనా ఉంటే ఆ ధైర్య పడకుండా తమ అప్లికేషన్లకు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు మరియు కరెంటు మీటర్ బిల్లు జత చేసి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని రసీదు పొందగలరు Brs 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్నది అని అన్నారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని అయినప్పటికీ ఈ పెరిగిన ధరనుంచి సామాన్య మహిళలకు ఊరట కలిగించేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించారు అని అన్నారు 500 కి గ్యాస్ సిలిండర్ ద్వారా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు ఎటువంటి ఇబ్బందుల అయినా ఎదుర్కొని ప్రజా పాలన సాగిస్తుందని గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది అని అన్నారు బి ఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భద్రాచలం అభివృద్ధికి ఒక పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి గుర్తు చేశారు