జె.ఎస్.ఎస్.యూనియన్ వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు
వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పౌర సంబంధాల అధికారిగా వంగరి శ్రీధర్ ఇటీవల భాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గురువారం జర్నలిస్టుల సంక్షేమ సంఘం యూనియన్ వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి,రాజన్న లడ్డూ ప్రసాదం అందజేసి,శుభాకాంక్షలు తెలియజేశారు.
డీపీఆర్ఓ ను కలిసిన వారిలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వొడ్యాల వేణు, ఉపాధ్యక్షులు భోగ మధు, కదిరె మహిపాల్, ప్రధాన కార్యదర్శి గజ్జెల శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి వంగరి మహేష్,కోశాధికారి దురిశేటి నాగరాజు,కార్యవర్గ సభ్యులు పెంతల సంపత్,సుదర్శన్, ఉన్నారు.