పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి 54 వ బూత్ లో రైతుబందు సమితి మండల అధ్యక్షులు పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు అధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబందు సమితి మండల అధ్యక్షులు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయమైన పాలకుర్తికి కోట్లు వేచ్చించి అభివృద్ధి పరిచాడని అన్నారు. పాలకుర్తి ప్రధాన రోడ్లను డబుల్ రోడ్లను చేసి, సెంట్రల్ లైటింగ్ తో చెట్లతో సుందరీకరణ చేయడం జరిగిందని అన్నారు. కాబట్టి అభివృద్ధి ప్రధాతయైన ఎర్రబెల్లి దయాకర్ రావుని భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కడుదుల కర్ణాకర్ రెడ్డి, ఎం.పి.టి.సి ఎడవేల్లి పురుషోత్తం, బీఆర్ఎస్ నాయకులు పన్నీరు వెంకన్న, పెనుగొండ వెంకటేశ్వర్లు, కనుకుంట్ల కన్నయ్య, చిదురాల మార్కండేయ, తిమ్మారావు, కడుదుల సురేష్, గుంజే సోమరాజు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.