భద్రాచలం నేటి ధాత్రి
ఈ రోజు రాజరాజేశ్వరి దేవాలయం వీధిలో నివాసముంటున్న మొక్కల ప్రేమిఖులుశ్రీమ తి దివ్య మాధవ రావు దంపతులు వివిధ రకాల పండ్ల మొక్కలు, కురగాయ మొక్కలు, పూలమొక్కలు వారి డాబా పై పెంపకం చేపట్టారు. ఎన్నో అరుదైన రకాలు ఎర్ర చింత, ఫిగ్ , ఫ్యాషన్ ఫ్రూట్, రెడ్ జామూన్ , తైవాన్ గోవా, సీడ్ లెస్ నిమ్మ , బే లీఫ్,కేరం బోలా , మలేషియన్ డ్రాగన్ మొదలగు రకాలు ఆన్లైన్ ద్వారా తెప్పించి సాగు చేస్తున్నారు. మిద్దె తోటల పెంపకoలో ఎన్నో మెలుకువలు తెలుసుకొని అందరికీ ఆదర్శం గా నిలిచారు. వారే స్వయంగా కంపోస్టు ను తయారుచేసి మొక్కలకు వాడటం హర్శించ దగ్గ విషయం. హైదరబాద్ నుండి ఉద్యానశాఖ ఉన్నతాధికారులు కమిషనర్ జేడీలు , ఏడీలు చూసి ప్రశంసించారు. అదేవిధంగా గా నన్ను కూడా ఆహ్వానించి మిద్దె తోట ల పెంపకం, డ్రిప్ మొదలు విషయాలగురించి అడిగి తెలుసుకున్నారు. నాకు ఒక ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కను బహుకరించారు. ఈ సందర్భగా dr. గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కూరలు, పoడ్లు , కూరగాయలు మనమే పెంచుకొని వాడటంవలన ఎన్నో రకాల వ్యాధుల బారిన పడకుండా ఉపశమనం లభిస్తుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న తాజా కూరలు తినటం ఆరోగ్యానికి మంచిది. మిద్దె తోటల గురించి ఆసక్తి ఉన్న వారు నన్ను సంప్రదించగలరు. ఇట్లు లయన్ డాక్టర్ గోళ్ల భూపతి రావు, గ్రీన్ భద్రాద్రి.