పాల్గొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జుక్కల్ ఎమ్మెల్యే తోట
ఎంపీ సురేష్ షెట్కర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మరియు బాన్సువాడ పట్టణంలో 54 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న అమృత్ 2.0 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి, అమృత్ 2.0 లో భాగంగా బాన్సువాడ పట్టణంలో మంచినీటి సరఫరా పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి, జహీరబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ షెట్కార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు తో, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.