రామడుగు, నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటూ పబ్బం కడుతుందని కరీంనగర్ జిల్లా రామడుగు మండల బిజెపి ప్రధాన కార్యదర్శి పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. ఈసందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పీఎం ఆవాస్ యోజన గృహాలను ఇందిరమ్మ ఇండ్లుగా ప్రచారం చేస్తూ అలాగే వివిధ రకాల కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్టి పథకాలను ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈకార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఐటీ సెల్ కన్వీనర్ మారిశెట్టి జయంత్, మత్య సెల్ అధ్యక్షులు బొజ్జ తిరుపతి, బూత్ అధ్యక్షులు కడారి శ్రీను, రాగం కనకయ్య, ఉత్తెం కనకరాజు, న్యాయవాది ఎడవల్లి రాహుల్, శ్రీసాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.