విద్యతో పాటు సంస్కారం ఉండాలి
క్రమశిక్షణకు మారుపేరు నిలవడం సంతోషకరం
న్యాయవాది సంతోష్
నేటిధాత్రి చర్ల
విద్యతో పాటు సంస్కారం ఎంతో ముఖ్యమని న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ అన్నారు వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ విద్యార్దులకు నల్గొండ జిల్లాకు చెందిన న్యాయవాది తన స్నేహితుడు కొత్తపల్లి శశాంక్ పంపించిన 10 వేల విలువ చేసే 30 స్కూల్ బ్యాగులను సంతోష్ సోమవారం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేసారు ఈ సందర్భంగా వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు అద్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు సోమవారం నిలయంలో జరిగిన చదువులతల్లి సరస్వతీదేవి పూజ సందర్భంగా విద్యార్దులకు స్కూల్ బ్యాగులను అందచేయడం సంతోషకరమని అన్నారు ఇక్కడి విద్యార్దుల క్రమశిక్షణ వారు పఠించే సంస్కృత స్లోకాలు అద్బుతమని పేర్కొన్నారు ఇక్కడి విద్యార్దుల క్రమశిక్షణను ఇతరులు చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు ఇక్కడి విద్యార్దుల గొప్పతనాన్ని తమ అడ్వకేట్స్ క్లాస్ మెట్స్ వాట్సాఫ్ గ్రూపులో పోస్ట్ చేయడంతో అనేక మంది స్పందించి విద్యార్థులకు సహాయ సహకారాలను అందచేసేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు తాము చదువుకున్న రోజులలో పడ్డ కష్టాలను ఇతరులు అనుభవించకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్దులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు తాను చెప్పిన ఒక్క మాటతో స్నేహితులు ముందుకు రావడం ఇక్కడి విద్యార్దుల గొప్పతనమేనని స్పష్టం చేసారు విద్యార్దులు కూడా దాతల నమ్మకాన్ని నిలబెట్టేలా పట్టుదలతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు తాను చర్ల నుండి హైకోర్టు లాయర్ గా ఎదిగానంటే దానికి చదువే కారణమన్నారు దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టిసారించాలని కోరారు వనవాసీ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ విద్యార్దులు దాతలు అందచేసిన సహకారాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు పేద విద్యార్దుల చదువులకు పెద్ద ఎత్తున సహకరిస్తున్న దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసారు ఈ కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ ఉపాద్యక్షుడు జవ్వాది మురళీకృష్ణ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు సభ్యురాలు పోలిన రమాదేవి నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి విద్యార్దుల తల్లిదండ్రులు ముదరయ్య ఉంగయ్య రేగుంట ఆచార్యురాలు కలం జ్యోతి పాల్గొన్నారు