రాకాపై డౌట్స్!!
‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ నుంచి రాబోయే సినిమా రాకా. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజున గ్లింప్స్ విడుదల చేశారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే.. 2027లోనూ ఈ సినిమా విడుదల అవ్వడం కష్టమే అన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ 40 శాతమే పూర్తయ్యిందట. మరో 60 శాతం బాకీ. 2027లోగా షూటింగ్ పూర్తవుతుంది. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైమ్ పడుతుంది. పలు అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. అవి అనుకొన్న సమయానికి అవుట్ పుట్ ఇస్తాయా, లేదా? అనేదానిపైనే రాకా రిలీజ్ డేట్ ఆధాప పడి ఉంటుంది. ‘పుష్ప’ రిలీజ్ డేట్ నే ‘రాకా’ ని విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే 2027 డిసెంబరులో సినిమా రావాలి. కానీ అప్పటికి కూడా సినిమా రెడీ అవ్వదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
