అన్న వర్సెస్ చెల్లి టీఆర్ఎస్ టైటిల్ ఎవరిది….

అన్న వర్సెస్ చెల్లి టీఆర్ఎస్ టైటిల్ ఎవరిది?

టైటిల్ కోసం అన్న వర్సెస్ చెల్లి. పాత పేరు..కొత్త ఎజెండా. యస్..! తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై ఇప్పుడు ఒకే టైటిల్.. రెండు పవర్ ఫుల్ మైండ్ గేమ్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్‌గా పేరు మార్చాక బాడీ లాంగ్వేజ్ మారింది సరే, కానీ పార్టీ గ్రాఫ్ పడిపోవడంతో అసలు ‘అస్తిత్వం’ దెబ్బతిన్నదన్నది కేడర్ వెర్షన్. అందుకే ఇప్పుడు కేటీఆర్ మళ్లీ “టీఆర్ఎస్” అనే సెంటిమెంట్ మంత్రాన్ని జపిస్తున్నారు. పేరు మార్పు వల్లే నష్టపోయామని, మళ్లీ పాత పేరుతో ప్రజల్లోకి వెళ్తేనే పోయిన వైభవం వస్తుందని అన్న కేటీఆర్ లెక్కలు వేస్తుంటే.. సరిగ్గా అక్కడే చెల్లి కవిత అసలు సిసలు పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ టైటిల్ ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తోంది. తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావొచ్చని ఆమె లీక్ ఇవ్వడం, మరోవైపు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఈసీ దగ్గర యుద్ధం చేయడం చూస్తుంటే.. తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని, ఆ పాత పేరులోని పవర్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఆమె స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ పార్టీ తన పేరును మార్చుకున్న సందర్భాలు లేవు. ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ పాత పేరు కావాలని ఈసీని కోరితే, అటు కవిత కూడా అదే పేరు కోసం పట్టుబడితే అది కాస్తా అన్నచెల్లెళ్ల మధ్య ‘టైటిల్ వార్’గా మారి కోర్టు మెట్లు ఎక్కడం ఖాయం. ఒకే ఇంటి నుంచి ఇద్దరు నేతలు ఒకే పేరు కోసం పోటీ పడటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. ఇది కేవలం పేరు కోసం జరుగుతున్న గొడవ కాదు.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ గడ్డపై అసలైన ‘వారసుడు’ ఎవరు? తెలంగాణ సెంటిమెంట్‌పై పట్టు ఎవరిది? అన్నది తేల్చుకోవడానికి జరుగుతున్న హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామా! టీఆర్ఎస్‌ పేరుతో పెను సంచలనం సృష్టించిన ఆ టైటిల్‌..ఇప్పుడు సరికొత్త ఫైట్‌కు దారితీస్తోంది. మరి ఆ పాత పేరుతో కొత్త ఎజెండాను సెట్ చేసే పవర్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version