హరిహర వీరమల్లును డిస్ట్రబ్‌ చేయం నాగవంశీ కామెంట్స్‌..

హరిహర వీరమల్లును డిస్ట్రబ్‌ చేయం.. నాగవంశీ కామెంట్స్‌

తన సినిమాల గురించి విష ప్రచారం చేసే వారిపై సోషల్‌ మీడియా వేదికగానో, ఇంటర్వ్యూ లోనో ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. మాటకుమాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది.

తన సినిమాల గురించి విష ప్రచారం చేసే వారిపై సోషల్‌ మీడియా వేదికగానో, ఇంటర్వ్యూలోనో  ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi). మాటకుమాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది. దాంతో ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ఏం జరిగినా, ఎవరు ఏం మాట్లాడినా ఆయన చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెబుతారు.

తాజా తన చిత్రాలు గురించి ఫెయిల్యూర్స్‌ (Naga Vamsi Failures) గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కథల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు పరాజయం పాలవుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంట గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్‌’ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాల పరంగా చేసిన తప్పులు, హరిహర వీరమల్లు సినిమా తదితర విషయాల్లో నాగవంశీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

‘హరి హర వీరమల్లు’ (harihara Veeramallu) చాలా పెద్ద సినిమా. కల్యాణ్‌గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ఇది. ఒక నగరంలో 10 థియేటర్లు ఉంటే, వీరమల్లు విడుదలైన రోజున అన్ని థియేటర్లలో ఆడుతుంది. తర్వాత వారానికి కనీసం నాలుగైదు థియేటర్లలో వేరే సినిమా వేసుకునే అవకాశం ఉంటుంది.  మాకు ఆ నాలుగు థియేటర్లు చాలు. నేను ‘హరి హర వీరమల్లు’ సినిమాను డిస్ట్రబ్‌ చేయను. ఇప్పటికే మా సినిమా కింగ్డమ్‌ విడుదల చాలా వాయిదాలు పడింది.. మరీ ఆలస్యం చేస్తే ఓటీటీకి ఇబ్బంది అవుతుంది’

ఆ రెండు సినిమాలు తీయకుండా ఉంటే సరిపోయేది..
‘మా బ్యానర్‌లో తెలిసి చేసిన తప్పు ‘రణరంగం’ (Rana rangam) సినిమా తీయడం. శర్వానంద్‌కు ఏజ్డ్‌ క్యారెక్టర్‌ కరెక్ట్‌ కాదని బాబాయ్‌ చెప్పినా నేనూ సుధీర్‌ వినిపించుకోలేదు. అయినా రిస్క్‌ చేసి సినిమా చేశాం.  రవితేజ లాంటి నటుడు చేసి ఉంటే బాగుండేదేమో. ఫస్ట్‌ సీన్‌లో శర్వాను డాన్‌గా చూపించాం. అతడు డాన్‌ ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుడికి ఏం ఉంటుంది? అని ఒక విమర్శకుడు అడిగారు. కరెక్టే కదా అనిపించింది.  ఆ తర్వాత అలాంటి తప్పులు చేయకూడదని కథల విషయంలో నిర్మొహమాటంగా ఉండే వారితో చర్చలు జరుపుతుండేవాడిని. అయినా మళ్లీ దెబ్బ తిన్నాం. ‘ఆది కేశవ’ ఫ్లాఫ్‌ అయింది. అవుట్‌పుట్‌ చూసుకున్న తర్వాత రిపేర్‌ చేయడానికి ప్రయత్నించాం. కానీ రోజురోజుకీ స్టోరీ జానర్‌ మారిపోతుంది. ప్రేక్షకులు ఓ పట్టాన యాక్సెప్ట్‌ చేయడం లేదు. దాంతో రిపేర్లు చేయడం కూడా వృథా అనిపించింది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్‌లో చాలా ఖరీదైన తప్పులు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version