పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ

పరకాల నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా పరకాల శాఖ గ్రంథాలయానికి ఉపాధ్యాయులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి సుమారు 5000 రూపాయాల విలువ అయిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథ పాలకులు డి.రాజేంద్ర ప్రసాద్ కి అంద చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యావేత్త ఎస్ వి విద్యా సంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాస చారి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని స్వాతంత్రోధ్యమం లో గ్రంథాలయాల పాత్ర ఎనలేనిదన్నారు.ఉపాధ్యాయులు కవి కామిడి సతీష్ రెడ్డి పరకాల గ్రంథాలయం కి స్వంతముగ పుస్తకాలు కొనుగోలు చేసి అందించడం అభినందనీయమన్నారు.ప్రతీ ఒక్కరు గ్రంథాలయం కి వచ్చి పుస్తకాలు చదివి ఉత్తమ పాఠకులుగా ఎదగాలని అన్నారు.పుస్తక ప్రియులు సతీష్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకుని పరకాల గ్రంథాలయానికి తమ వంతుగా పుస్తకాలు బహుకరన చేయాలని గ్రంథాలయాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ముఖ్య సలహా దారులు యడ్ల సుధాకర్,జర్నలిస్ట్ రేపాల నర్సింహ రాములు,రంగ స్థల కళాకారులు ఏర్కొండ రామ దాసు,బి.ఎం.ఎస్ సీనియర్ నాయకులు ఆడగాని జనార్దన్ రావు,గ్రంథాలయ సిబ్బంది అరుణ,పాఠకులు నూతన్, యాట రాజేందర్,రవి,సురేష్, నవీన్,శ్రీనివాస్,అజయ్, సుమలత,మేఘన,శ్రీకాంత్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version