కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన జిల్లాఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి .మండలo లోని. పలు గ్రామాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని సూచిస్తూ కనీస వసతులు కల్పించాలని. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అదనపు కలెక్టర్ ఆదేశిస్తూ. ధాన్యం కేంద్రాలకు తరలించేందుకు లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అంతకుముందు మండలంలోని. తాడూరు. పాపయ్యపల్లి. ఓబులాపూర్. సారంపల్లి. రాళ్ల పేట. కస్బేకట్కూర్.చీరలవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్లవారం పరిశీలిస్తూ ముందుగా ఆయా ధాన్య కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పల వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. దాన్యం తే మశాతం కొనుగోళ్లను పరిశీలించారు. ఇట్టి పరిశీలనలో తంగళ్ళపల్లి ఎమ్మార్వో.జయంత్ కుమార్. కొనుగోలు కేంద్రాల సంబంధిత సిబ్బంది. ఐకెపి సెంటర్. నిర్వాహకులు.తదితరులు ఉన్నారు
