ఎవుసానికి కాంగ్రెస్ భరో సా.. రైతు సంక్షేమమే ధ్యేయం
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని నేరేడుపల్లి,ప్రగతిసింగారం, వసంతాపూర్, కొప్పుల గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఐకేపీ, పీఏసీ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరు గాలం కష్టపడి శ్రమించి పండిం చిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొను గోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసు కువచ్చి, ప్రభుత్వం నిర్ణయిం చిన గిట్టుబాటు ధరలు పొం దాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుం డా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికా రులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్ర మంలో అన్ని గ్రామా ల కాంగ్రెస్ కార్యకర్తలు, పలు వురు ప్రజా ప్రతినిధులు, అధి కారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు పాల్గొన్నారు
ఎమ్మెల్యేను కలిసిన పెద్దకో డెపాక గ్రామ రజక కుల స్తులు
శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామ మడేల య్య రజక సంఘం నాయ కులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను హన్మకొండ లోని వారి గృహంలో కలిశారు. ఈ సంద ర్భంగా గ్రామంలోని చాకలి రేవు కుడి చెరువు వద్ద కుల దైవమైన మడేలయ్య ఆల యం నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని, శ్రీ మడేలయ్య, శ్రీ సీతల దేవత, శ్రీ ఈదమ్మ, శ్రీ వినాయకుడు, శ్రీ నంది మరి యు శ్రీ శివలింగం విగ్రహాలను బహుకరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు.
