*మున్సిపల్ పార్కులో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ – జగన్నాదం…

*మున్సిపల్ పార్కులో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ – జగన్నాదం…

*ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ 40 వ వార్షికోత్సవం….

తిరుపతి(నేటిధాత్రి:

స్థానిక మున్సిపల్ పార్కులో మజ్జిగ ప్యాకెట్లను వాకర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు మూగజీవుల ప్రేమికుడు శ్రీ వారి భక్తులు జగన్నాథం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ 40వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక కపిల్ తీర్థం మార్గంలో గల మున్సిపల్ పార్కులో జగన్నాథం ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ప్రబోధానంద స్వామి, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు ఆర్కాడ్ కృష్ణ ప్రసాద్, శాంతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్లు మాట్లాడుతూ ఎండలు మెండుగా కాస్తున్న సందర్భంగా వా కర్స్ కు మరియు కుటుంబ సభ్యులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది, అలాగే వాకర్ సభ్యులు మరియు దాతలు ప్రతిరోజు పార్కులో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రబోధానంద స్వామి మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున మజ్జిగ గానీ పెరుగన్నం గాని ఇతరులకు పంచడం మంచిదని జగన్నాథంకు సూచించానని అందుకే ఈ కార్యక్రమంలో నిర్వహించారని, తెలిపారు. ఈ సందర్భంగా మూగజీవుల ప్రేమికుడు జగన్నాథం మాట్లాడుతూ ఈరోజు పార్కులో మజ్జిగపుంచడం మా అదృష్ట భావిస్తూ , మండుతున్న ఎండలకు మానవులు మనమే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మూగజీవులకు మన వంతు సహాయంగా మన గుమ్మం ముందు గాని, మన పిట్టగోడ పైన గాని, పెరటి ముందుగాని వీధిలో మనకు అందుబాటులో ఉన్నచోట గోవులకు,కుక్కలకు, పక్షులకు గాని నీళ్లు పెట్టి వాటి దాహార్తిని తీర్చితే పుణ్యం కలుగుతుందని వీలైనంతవరకు మన ఇంట్లో ఉన్న తినుబండారాలను అన్నం వంటి వాటిని వృధా చేయకుండా మూగజీవులకు ప్రతిరోజు పెట్టండి అదే మనకు ఆనందాన్ని అదృష్టాన్ని కలగజేస్తుందనీ దీనిని తప్పకుండా ఆచరించగలరని కోరుతున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి, సెక్రటరీ మస్తాన్ , ఉపాధ్యక్షులు జగన్నాథం,డి. గురునాథం,కె.ఈశ్వర్ రెడ్డి, పి. బలరాం రెడ్డి, కొత్తపల్లి మునిరత్నం , ఆర్.మధు, సుదర్శన్ శెట్టి, మరియు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష సెక్రటరీలు సాంబశివారెడ్డి, సుబ్బారావు, రోహిత్ బాబు, సురేష్ రెడ్డి అంజి, తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version