ఆలుగడ్డ రైతు గట్టెక్కేనా..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-19T131531.037.wav?_=1

 

 

ఆలుగడ్డ రైతు గట్టెక్కేనా?

◆:- కొండెక్కిన విత్తనం ధర

◆:- సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, ప్రతి వ్యక్తి అలుగడ్డ రుచి ఎరుగని వారు ఉండరు.. ప్రతి రోజు కూరగాయల్లో ఒకటైన అలుగడ్డ విప రీతమైన డిమాండ్ ఉంటుంది. దీనిని ప డించే రైతుకు మాత్రం ప్రతి సంవత్సరం చే దు అనుభవమే ఎదురవుతుంది. అలుగడ్డ పండించే రైతులకు సబ్సిడీపై విత్తనాన్ని క్ర భుత్వం సరఫరా చేయకపోవడంతో మధ్య దళారుల వద్ద కొనుగోలు చేసి పంట వేయ డం వల్ల ధర రాక నష్టాల భారిన పడుతున్నా రు. ఈ ఆలుగడ్డ సీజన్లో మొదటగా అలుగడ్డ విత్తనం 50 కిలోల బస్తా రూ.850 నుండి రూ.1000 వరకు కొనుగోలు చేశారు. అలు గడ్డ ఇచ్చిన తర్వాత వర్షాలు అధికంగా పడడంతో వేసిన పంట మొలకెత్తగా అలు విత్తనం మొరిగిపోయింది. దీంతో రైతులు చేసేది ఏం లేక కొత్తగా మళ్లీ దుక్కిని చదును చేసి అలుగడ్డ విత్తనాన్ని నాటారు. ఈసారి మాత్రం విత్తనం కొనుగోలు చేయాలంటే 50 కిలో బస్తా రూ.1600 వరకు కొనుగోలు చేసి అలుగడ్డ పంటను వేశారు. తెలుగడ్డ మాత్రం అతి తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట కావడంతో రైతులు ఈ పంటపై ఎక్కు వ ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ని యోజకవర్గంలో కోహిర్ మండలంలో అధి రంగా అలుగడ్డ పంటను పండిస్తుంటారు. ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, హీరాబాద్ మండలాల్లో 50 శాతం రైతులు అలుగడ్డను పండిస్తుంటారు. ఆలు రైతులకు ఈ సంవత్సరం మాత్రం పంట దిగుబడి ఎలా వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
పంట వచ్చే సమయంలో మార్కెట్లో ధర ఏవిధంగా ఉంటుందని ఎదురుచూస్తున్నా రు. ముఖ్యంగా ఈ పంటను ఉద్యాన శాఖ కింద ఇవ్వవలసిన సబ్సిడీలు అందకపోవ డంతో రైతులు తమ సొంత ఖర్చుతోనే ఆలు గడ్డను పండిస్తున్నారు.

ఎకరాకు రూ.35వేల పెట్టుబడి…

ఒక్క ఎకరం అలుగడ్డ పండించడానికి దాదాపుగా 35 వేల నుండి 40 వేల రూపా యలు ఖర్చు అవుతుంది. అలుగడ్డ పంట వచ్చే సమయానికి హైదరాబాద్ మార్కెట్లో ధర ఉన్నట్లయితే కొద్దిపాటి లాభాలు వస్తా యి తప్ప మార్కెట్లోకి ఎక్కువ ఆలుగడ్డ రావ డం వల్ల ధర పడిపోవడంతో రైతులు ఆవేద న గురవుతారు. అధిక పెట్టుబడులు పెట్టి పంటను పండించినప్పటికీ లాభాలు రాకపో వడంతో రైతులు నష్టాల బారిన పడుతు న్నారు. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం అలుగడ్డ విత్తన స్టోరేజీని జహీరాబాద్ ప్రాం తంలో నెలకొల్పాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఆ పని ఎండమావిగానే మిగిలిపోతుంది. రాజకీయ పార్టీలు మారుతున్నాయి తప్ప ఆలు రైతుల గోస మాత్రం వినిపించుకున్న దాఖ లాలు లేవు. ఈ సంవత్సరం ఆలుగడ్డలు రెం డుసార్లు విత్తడం వల్ల రైతుకు ఎకరాకు రూ. 60 వేల నుండి 70 వేల ఖర్చు వచ్చింది. ప్ర భుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని జహీ రాబాద్ ప్రాంతంలో అలుగడ్డ విత్తనాన్ని నిల్వ ఉంచే స్టోరేజీలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. స్టోరేజీలు ఏర్పాటు చేయకపోతే ఆగ్రా, జలంధర్ నుండి వచ్చే అలుగడ్డ విత్తనానికి రైతులకు సబ్సిడీ ఇవ్వా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version