డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని లబ్ధిదారుల ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 468 డబుల్ బెడ్ రూమ్ లు కట్టి ఇవ్వడం జరిగింది 392 డబుల్ బెడ్ రూమ్ లను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లబ్ధిదారులను ఎంపిక చేసి డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఇంటి నెంబరు కేటాయించి ఇవ్వడం జరిగింది కానీ పంచిన డబుల్ బెడ్ రూమ్ లకు పట్టాలు ఇవ్వలేదు తరువాత అసెంబ్లీ ఎలక్షన్లు రావడంతో రాష్ట్రంలోఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తరువాత లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్లడానికి అర్హత లేకుండా పోయింది రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులకు వచ్చింది గత ప్రభుత్వం చేసిన పనులను అన్నిటిని ఎక్కడికక్కడ ఆపివేసింది దానితో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు మాకు ఇస్తారు అనే ఆశతో ఎదురుచూసి రోజులు గడిచాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు దానితో ఇప్పుడు లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద టెంటు వేసి నిరాహార దీక్షలు చేస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలి అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించి సమస్యను పరిష్కరించి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలి అని వారు కోరుతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version