చేగువేరా స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం

పరకాల నేటిధాత్రి
ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ అన్నారు.పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా జయంతి 96వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ పేదల పక్షాన చివరివరకు పోరాడిన వీరుడు చేగువేరా ను యువతరము ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.వైద్య వృత్తిలో, ఇంజినీరింగ్ విద్యలో పట్టా పుచ్చుకొని,బహు బాషలలో అనర్గలంగా మాట్లాడే ప్రావీణ్యం,రచయితగా,కవిగా రాణించిన వ్యక్తి చేగువేరా అన్నారు.ప్రజలను ఆర్థిక, రాజకీయ,సాంఘిక దోపిడీ నుంచి విముక్తి కోసం, సామ్రాజ్యవాదాన్ని అంతమొందించాలని పోరాటం చేసిన గొప్ప విప్లవకారుడు అని వెల్లడించారు.జీవితాంతం ప్రజలకోసం జీవించిన మహానాయకుడు అని తెలిపారు.ప్రస్తుతం సమాజంలో యువత మతానికి,మత్తు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.వాటిని వదిలి అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచినప్పుడే చేగువేరా ఆశయాలు సాధించగలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అనీల్,రాకేష్, శివ,మహేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version