సౌదీ అరేబియా బస్సు ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి
◆:- షైక్ రబ్బానీ ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ పేర్కొన్నారు. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్నా బస్సు డిజిల్ ట్యాంకర్ ను ఢీకొని భారతీయ యత్రికులు సజీవ దహనమైన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు
వారిలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామానికి చెందిన మౌలానా, ఆయన కూతురు గౌసియా బేగం, అల్లుడు ఖదీర్, మనుమడు సోయబ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు, అలాగే, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా సౌదీ అధికారులతో మరియు భారత్ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
