దశరథ్ కు మున్సిపల్ కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలు

*దశరథ్ కు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

జహీరాబాద్ తహసీల్దార్ పీ.దశరత్ కు మున్సిపల్ కమిషనర్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కమిషనర్ కే. సత్య ప్రణవ్ శిక్షణా కార్యక్రమానికి హాజరవుతున్నందున తహసీల్దార్ కు కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా గ్రూప్-1 నుంచి కమిషనర్ బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలొచ్చాయి. ఎన్నికల నిర్వహణపై అవగాహన లేని కారణంగా కలెక్టర్ ఆదేశాలతో కొంతకాలంగా తహసీల్దార్ ఎన్నికల విధులను పర్యవేక్షిస్తున్న సదరు తహసీల్దార్ ప్రస్తుతం పూర్తి బాధ్యతలు చేపట్టారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version