బీసీ బందుకు సంపూర్ణ మద్దతు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకునే రాజకీయ పార్టీని అందరూ గుర్తించాలని సీపీఐ(ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. ఈ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ జరగాలన్నారు. బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గనేది లేదని స్పష్టం చేశారు. తాము స్వతంత్రంగా ఉద్యమాలను చేపడతామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అఖిలపక్షం సహకారంతో ఢల్లీి కేంద్రంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు , పోలేం రాజేందర్, గుర్రం దేవేందర్, ఆకుదారి రమేష్, గడప శేఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
