నర్సంపేట,నేటిధాత్రి :
మార్చి 3,4,5 తేదీలలో జరుగు సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ యూనిటీ జాతీయ మహాసభల ను జయప్రదం చేయాలని సి.పి.ఐ. ఎం.ఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) ఆధ్వర్యంలో గిర్ని బావి, దుగ్గొండి మండల కేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి అడ్డూరి రాజు మాట్లాడుతూ మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే సీపీఐ(యం.యల్) ప్రజాపంథా,పీసీసీ సీపీఐ (యం.యల్), సీపీఐ (యం.యల్) ఆర్.ఐలు నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా, నూతన ప్రజాతంత్ర విప్లవ సాధనే ధ్యేయంగా మూడు విప్లవ పార్టీలు ఐక్యమై “సీపీఐ (యం.యల్) మాస్ లైన్ అనే కొత్త పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.మార్చి 3,4,5 తేదీ లో ఐక్య పార్టీ యూనిటి జాతీయ మహాసభలను ఖమ్మంలో నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న కుల, మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా కుల, మత, ఆర్థిక ,అసమానతలు లేని సమ సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు విప్లవోద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే మార్చి 3వ తేదీన ఖమ్మంలో వేలాది మందితో జరుగు భారీ ర్యాలీ, బహిరంగ సభ, 4,5 తేదీ లో జరిగే ప్రతినిధుల సభను జయప్రదం చేయాలని ప్రజలకు, ప్రజాస్వామ్య వాదులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దార లింగన్న, సాంబన్న, కిరణ్, ఠాగూర్, కుమారస్వామి సి.హెచ్ మల్లయ్య, రమేష్ ,వీరన్న తదితరులు పాల్గొన్నారు.